కొత్త మంత్రులకు పలు సూచనలు

అమరావతి: మంత్రివర్గంలో ఫరూక్, కిడారి శ్రవణ్ అవకాశం ఇస్తున్నట్లు ఏపి సియం చంద్రబాబు ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూక్, కిడారి శ్రవణ్‌లతో చంద్రబాబు భేటి అయ్యారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కిడారి శ్రవణ్ వయసులో చిన్నవాడైనా మంత్రిగా అవకాశమిస్తున్నట్లు ,సద్వినియోగం చేసుకోవాలని ,పార్టీకి మంచి పేరు తేవాలని ఆయనకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌పాషాను ఖరారు చేశారు. మంత్రిగా రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫరూక్ శాసనమండలి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.