కొత్త టెక్నాలజీల్లో 85 వేల ఐటి ఉద్యోగాలు

IT SECTOR
IT SECTOR

కొత్త టెక్నాలజీల్లో 85 వేల ఐటి ఉద్యోగాలు

న్యూఢిల్లీ, జూన్‌ 5: భారత్‌లోని 150 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ ఉన్న ఐటిరంగంలో లేఆఫ్‌లు మరింత ఎక్కువగా ఉంటున్నాయన్న వాదనను ఐటి సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. రానున్న కాలంలో కొత్త టెక్నాలజీపై నైపుణ్య తర్ఫీదు ఇచ్చిన తర్వాత 85 వేల ఉద్యోగాలు కొత్తగా రానున్నట్లు కంపెనీలు ఘంటా పథంగా చెపుతున్నాయి. అయితేనిర్వ హణ వ్యయం ఆదా చేసుకునేందుకు కంపెనీలు ఆటోమేషన్‌ వైపు పరుగులు పెడుతున్న మాట వాస్తవమే. అందు వల్లనే ఎక్కువగా లేఆఫ్‌లు ఎదురవుతు న్నాయి.

కొన్ని స్థాయిల ఉద్యోగులకు పింక్‌స్లిప్‌లు జారీచేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు పరోక్షంగా ప్రతిభ పెంచుకోకుంటే కష్టమేనన్న సంకేతా లిస్తుండటంతో అసలే మానసిక వత్తిడి అధికంగా ఉంటున్న ఐటి ఉద్యోగులకు ఇదో పెద్ద గండంగా పరిణమించింది. అయితే మన ఐటి ఉద్యోగులేమీ ఇందు కు తక్కువేమి తినలేదు. కొత్త టెక్నాలజీ అలవరు చుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కొత్త నైపు ణ్యం, కొత్తభాషలపై అవగాహనపెంచుకుని కొత్త డిజిటల్‌ టెక్నాలజీ మార్పులవైపు పరుగులు తీస్తు న్నట్లు తెలుస్తోంది. సింప్లిలెర్న్‌ అనే ఆన్‌లైన్‌ శిక్షణ వేదిక అంచనాలను చూస్తే బిగ్‌డేటా, క్లౌడ్‌ డేటా సైన్స్‌, డెవోప్స్‌, సైబర్‌సెక్యూరిటీ వంటివి వాటిలో 50శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు వెల్లడించింది. గడ చిన నాలుగేళ్లలోనే అత్యుత్తమ ప్రతిభఉందని సింప్లి లెర్న్‌ అంచనావేసింది.

మూడునెలల్లోనే డెవాప్స్‌ కేటగిరీలో 109శాతం వృద్ధి ఉంటుందని, క్లౌడ్‌పరం గా 70శాతం బిగ్‌డేటా పరంగాను, డేటాసైన్స్‌ పరంగాను 60శాతం, 45శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనాలు వేసింది. ఒక్క డేటాసైన్స్‌ విభాగంలోనే 85వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే సరైన ప్రతిభ లేక సతమతం అవుతున్న ఈ కేటగిరీలో కొత్త ఉద్యోగాలు పుష్క లంగా ఉంటాయని సింప్లిలెర్న్‌ ప్రతినిధి కశ్యప్‌ దలాల్‌ వెల్లడించారు. మూడుమిలియన్లకుపైగా ఐటి ఉద్యోగులతో దేశంలోనే ఐటిరంగం అతిపెద్ద ఉపాధి రంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో లేవనెత్తిన ఉద్వాసన పర్వాలు లేఆఫ్‌ లు ఉద్యోగుల్లో కలవరం పెంపొం దించాయి.

ఫలితంగానే ఐటి ఉద్యో గుల సంఘాలు ఆవిర్భవించాయి. కాగ్నిజెంట్‌ వంటిపెద్ద కంపెనీల ఉద్వాసన పర్వాలతో రోడ్డునపడిన వారంతా ఆయా రాష్ట్రాల కార్మిక కమిషనర్లను సైతం కలిసి సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికి తెచ్చా రు. ప్రస్తుతం ఐటి రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో క్లౌడ్‌ ఇంజినీర్‌, డెవోప్స్‌ ఇంజినీర్‌, అజూర్‌, ఎడబ్ల్యు ఎస్‌ కన్సల్టెంట్‌, క్లౌడ్‌ అజూర్‌ ఆర్కిటెక్ట్‌, బిగ్‌డేటా డేటా సైన్స్‌లో అడ్మినిస్ట్రేటర్‌, ఆర్కిటెక్ట్‌, డేటా సైంటిస్ట్‌, డైరెక్టర్‌; ఇంజినీర్‌, సైబర్‌ సెక్యూరిటీపరంగా సెక్యూరిటీ ఆడి టర్‌ ఇన్‌ఫర్మేషన్‌, సెక్యూరిటీ మేనేజర్‌/ఇంజినీర్‌, సైబ ర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌ వంటి నైపుణ్యవిభాగాల్లో వేల ాది ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నట్లు నిపుణుల అంచనా.