కొత్త జోనల్‌ విధానానికి కేంద్రం ఆమోదం

ZONES
ZONES

న్యూఢిల్లీ : తెలంగాణ నూతన జోనల్‌ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. నూతన జోనల్‌ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్‌ విడుదల చేయడంతో..త్వరలోనే కొత్త జోనల్‌ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.