కొత్త జీవితంతో ఉల్లాసంగా..

CHELI7
New Life with Love

కొత్త జీవితంతో ఉల్లాసంగా..

ప్రేమ జీవితాంతం కలిసి జీవించి నప్పుడే అందులో ఆనందం ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమి కులు విడిపోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుని, జరిగిన విషయాలన్ని మర్చిపోయి, మామూలుగా జీవించాలంటే కాస్త సమయం పడుతుంది. ఇందులో బాధకు కొదువ ఉండదు. ఇలాంటప్పుడే ఏం చేయాలి? ప్రేమికులు విడిపోయినప్పుడు చెప్పలేనంత ఒత్తిడి ఉంటుంది. అప్పుడే బాధ పడటానికి కూడా తీరికలేనంత బిజీగా అయి పోవాలి. అంటే ఓ కొత్త అలవాటు, కొత్త భాష నేర్చుకోవడం, కోర్సులో జాయినవడం వంటివి ఎన్నుకోండి. మీ బాధల్ని మర్చిపోయేందుకు ముద్దొచ్చే పప్పీని పెంచుకోండి. చిలుక పలుకుల చిలకని ఇంటికి తెండి. వాటి హంగామా ముందు మీ బాధ హుష్‌కాకి. మనం ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే మనసులోని బాధ అంత దూరమవ్ఞతూ ఉంటుంది. స్నేహితులతో జాలీ ట్రివ్‌, పుణ్యంపురుషార్ధం దక్కేలా పుణ్యయాత్ర ఏదైనా బాధకి మరుపు మందు వేసినట్టే. నిండుకుండలాంటి భారీ డ్యాం అయినా గేట్లు ఎత్తకుంటే బద్ధలవ్ఞతుంది. మీ బ్రేకప్‌ తాలూకు బాధ, ఆవేశం, కష్టం చల్లబడాలంటే మీ మాజీ లవర్‌పై ఉన్న అక్కసుని స్నేహితులు, ఆత్మీయుల ముందే కక్కేయాల్సిందే. లవర్‌ బ్రేకప్‌ చెప్పినపుడు లోపాలు కనపడతాయి. వాటినే తలచుకుంటూ మథనపడుతుంటారు చాలామంది. ఇది పనికిరాదు. మీ బలాలు గుర్తుకు తెచ్చుకొని నన్ను వదులుకోవడం తనకే నష్టం అని సముదాయించుకోండి. ఒంటరిగా ఉంటే సువాసనలు వెదలజల్లే కొవ్వొత్తులు వెలిగించడం, ఒంటికి హాయినిచ్చే తేలికైన మసాజ్‌లు. ఇష్టమైన సంగీతం వినడం మనసులోని బాధని తగ్గిస్తాయి. ్నం మనసులోని బాధని తగ్గిస్తాయి.