కొత్త జిల్లాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఆమోదం లేదుః రేవంత్‌రెడ్డి

REVANTH REDDY
REVANTH REDDY

హైద‌రాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఏడాది గడిచినా… వాటికి ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. గెజిట్ లో ఇంతవరకు కొత్త జిల్లాలను ప్రకటించకపోవడంతో… కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. ప్రధాని మోదీని తమరు చాలా సార్లు కలిశారని… అయినా, కొత్త జిల్లాల గురించి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.