కొత్త క‌ళ‌తో దేశీయ మార్కెట్లు

stock market
stock market

ముంబై: వారాంతంలో దేశీయ సూచీలు లాభాలతో కళకళలాడాయి. బ్యాంకింగ్‌, ఐటి రంగ షేర్ల అండతో కొత్త రికార్డులను సాధించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా ఇందుకు కలిసొచ్చాయి. మదుపర్లు కొనగోళ్ల వైపు మొగ్గుచూపడంతో ఆరంభం నుంచి లాభాల జోరు సాగించిన సూచీలు శుకవ్రారం సరికొత్త గరిష్టాలను చేరుకున్నాయి. సెన్సెక్స్‌ ప్రతిష్టాత్మక 34 వేల మైలురాయికి 60 పాయింట్ల దూరంలోనే ఉంది. ఇక నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్టస్థాయికి తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఓఎన్‌జిసి, హిదాల్కో, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, లుపిన్‌, కోల్‌ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ,టాటా స్టీల్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.