కొత్త ఏడాదిలో ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు

it jobs
it jobs

హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో ఐటీ, అంకుర సంస్థలు దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. ఈ రంగాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి జీతభత్యాలు 2018తో పోల్చితే వచ్చే ఏడాదిలో 20 శాతం అధికంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఐటీ రంగ ఉద్యోగుల ప్రాధమిక వేతనాలు ఇప్పుడు ఏడాదికి రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగాయని అన్నారాయన. గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో స్తబ్దత ఉండగా, వచ్చే ఏడాదిలో పరిస్థితి ఎంతో ఆశావహంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు