కొత్త అనుభూతినిచ్చే చిత్రం!(వెంకటాపురం)

Venkatapuram11
A Stil from Venkatapuram

కొత్త అనుభూతినిచ్చే చిత్రం!(వెంకటాపురం)

గుడ్‌ సినిమా గ్రూప్‌ పతాకంపై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తుము ఫణి కుమార్‌ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెంకటాపురం. యంగ్‌ హీరో రాహుల్‌, మహిమా మక్వాన్‌ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను ఇటీవలే స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ చిత్ర యూనిట్‌ సమక్షంలో లాంచ్‌ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 29న ఉగాది సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా.. నిర్మాతల్లో ఓకరైన శ్రేయాస్‌ శ్రీను మాట్లాడుతూ.. కథ విషయానికోస్తే ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆధ్యంతం ఆసక్తి కరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంలో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. హీరో రాహుల్‌ లుక్‌ కోసం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు. హీరోయిన్‌ మహిమా మక్వాన్‌ చిత్రానికి హైలెట్‌ గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకి ఒ కొత్త అనుభూతిని మాత్రం ఈ చిత్రం కల్పిస్తుంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులని ఈ సినిమా అలరిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు అని అన్నారు