కొత్తనోట్ల ముద్రణ కూడా ఆర్థికభారమే!

2000
2000

కొత్తనోట్ల ముద్రణ కూడా ఆర్థికభారమే!

ముంబై, డిసెంబరు 21: పాతనోట్ల రద్దు ఆస్థానంలో కొత్తనోట్లను చెలామణిలోనికి తీసుకురావాలంటే అందుకు ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులు పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలుచేయాల్సి ఉంది. కొత్త రూ.500నోటు ముద్రించేందుకు ఒక్కొక్క నోటుకు రూ.3.09లు ఖర్చవుతుంది. అలాగే గులాబిరంగు రూ.2వేల నోటు ముద్రించాలంటే రిజర్వుబ్యాంకుకు 3.54 రూపాయలు ఖర్చవుతుంది. ఈ నోట్లను భారతీయ రిజర్వుబ్యాంకు నోటు ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపరంగా ముద్రణచేస్తుంది.

బిఆర్‌బిఎం పిఎల్‌ రిజర్వుబ్యాంకు అనుబంధంగా పనిచేస్తుంది. ఆర్‌టిఐ కింద చేసిన విజ్ఞప్తిపై బ్యాంకు స్పందించి సెంట్రల్‌ బ్యాంకు3090 రూపాయలు 500 నోట్లు వెయ్యిముద్రించేందుకు ఖర్చవుతుంది. అలాగే రూ.2వేలనోట్లు ముద్రించేందుకు ప్రతి వెయ్యి నోట్లకు ఆర్‌బిఐకి 3540 రూపాయలు ఖర్చవు తుంది. రద్దు చేసిన వెయ్యినోటు ముద్రించేందుకు సైతం ఇదే ఖర్చయింది. కొత్త బ్యాచ్‌ రూ.500 నోట్లు పంపిణి చేస్తున్నట్లు, మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ ఇన్‌సెట్‌ లెటర్‌ ‘ఆర్‌తో ఈనోట్లు వస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం రద్దయని నోట్లస్థానంలో కొత్త బ్యాచ్‌ బ్యాంకునోట్లు ఆర్‌ ఇన్‌సెట్‌ అక్షరంతో వస్తాయని ప్రకటించింది. ఈ నోట్లపై ఆర్‌బిఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌పటేల్‌ సంతకం ఉంటుంది.

అలాగే ముద్రించిన సంవత్సరం 2016 అని కూడా నోట్లపై ఉంటుందని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఆర్‌బిఐ సత్వరమే రూ.50 నోట్లు కూడా అందిస్తామని, 2005సీరీస్‌ మహా త్మాగాంధీ సిరీస్‌ నోట్లు ఆర్‌, ఎల్‌ అక్షరాలను నంబరు ప్యానెల్‌లో చేర్చి కొత్తనోట్లు జారీచేస్తామని వివరించింది. మనీలాండరింగ్‌, నకిలి కరెన్సీ, అవినీతిని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు గడచిన నవంబరు 8వ తేదీ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ప్రభు త్వం రద్దయిన నోట్లస్థానంలో ఆరులక్షల కోట్ల కొత్తనోట్లను మాత్రమే ఆర్థికవ్యవస్థలోనికి తీసుకురాగలి గింది. మిగిలిన మొత్తం రావాలంటే మరో మూడునెలలైనా పడుతుందని ఆర్థికరంగ నిపుణుల అంచనా.