కొత్తగూడెంలో మైనింగ్‌ వర్సిటీ!

kcr
kcr

భద్రాద్రి కొత్తగూడెం: టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే కొత్తగూడెంలో మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తామని టిఆర్‌ఎస్‌ అధినేత, సియం కేసిఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూములు సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏ వర్గాన్ని మేం నిర్లక్ష్యం చేయలేదు. ఓటు వేసే ముందు జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని అన్నారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే కొత్తగూడెం జిల్లా అయ్యిఉండేదా? జిల్లా ఏర్పాటు చేసినందుకు బహుమానంగా జలగం వెంకట్రావును గెలిపించి రుణం తీర్చుకోవాలి అని కేసిఆర్‌ ఓటర్లను అభ్యర్ధించారు.