కొత్తగా కనిపించనుంది!

TAMANNAH1
TAMANNAH

 కొత్తగా కనిపించనుంది!

తెలుగులో అగ్రకథానాయిక అనిపించుకున్న తమన్నా, కోలీవుడ్‌ లోను ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె తమిళంలో స్కెచ్‌ సినిమా చేస్తోంది. విక్రమ్‌ కథానాయకుడిగా చేస్తోన్న ఈ సినిమాకి, విజ§్‌ు చందర్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో బైక్స్‌ ను దింగిలించే దింగగా విక్రమ్‌ నటిస్తున్నాడు. ఆయన ప్రేయసిగా తమన్నా కనిపిస్తుంది. ఇటీవలే ఈ ఇద్దరి కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ ను పాండిచ్చేరిలో చిత్రీకరించారు. ఇప్పటివరకూ మోడ్రన్‌ డ్రెస్‌ లలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన తమన్నా, ఈ సినిమాలో హోమ్లీగా కనిపిస్తూ కనువిందు చేస్తుందట. తమన్నా కొత్తగా .. మరింత అందంగా కనిపిస్తుందని అంటున్నారు. శిబూ తమీన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా భారీతనానికి అద్దం పడుతుందని చెబుతున్నారు.