కేసును కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది!

Mayawathi
Mayawathi

లక్నో: వివేక్‌ తివారీని గత శనివారంనాడు కాల్చిచంపిన పోలీసులపై చర్యలు తీసుకోవండంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వేషాలు వేస్తున్నారని బహుజన్‌ సమాజ్‌వాధీ పార్టీ అధినేత్రి మాయవతి విమర్శించారు. ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతు, తాను ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఘటనలో ప్రమేయమున్న పోలీసులపై మొదటి చర్య తీసుకుని ఆ తర్వాతే బాధిత కుటుంబ సభ్యులను కలిసేదానినని ఆమె అన్నారు. వివేక్‌ తివారీ భార్య కల్పనా తివారీని యోగి ఆదిత్యనాథ్‌ ఈరోజు కలుసుకోవడంపై మాయావతి మాట్లాడుతు, కేసును కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నింస్తుందని ఆమె అన్నారు.