కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో కీలకపాత్ర వ‌హిస్తాః రేవంత్‌

revanth
revanth

న్యూఢిల్లీః  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు వేసేందుకే తాను ఢిల్లీ వెళ్లానని టీడీపీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతల చందాల వసూలుపై ఢిల్లీలో కేసు వేస్తానని, కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో కీలకపాత్ర వహిస్తానని, డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పారు. తాను చంద్రబాబును అపాయింట్ మెంట్ అడగలేదని, తెలంగాణలో పార్టీలు లేవని, కేసీఆర్ వ్య తిరేకులు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు.