కేసిఆర్‌ గెలిచే అవకాశమే లేదు: డీకె అరుణ

d.k.aruna
d.k.aruna

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌పై కాంగ్రెస్‌ మహిళా నేత డీకె అరుణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సారి కేసిఆర్‌ తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ గెలవరని జోస్యం చెప్పారు. రైతులకు రూ. 4 వేలు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. రౌడీ సమన్వయ సమితులను ఏర్పాటు చేసి వాటిని రైతు సమన్వయ సమితిలు అనడం హాస్యాస్పదమని డీకె అరుణ విమర్శించారు.