కేసిఆర్‌ కాళేశ్వరం సందర్శన వాయిదా

TS CM KCR
TS CM KCRr

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌ మంగళవారం నాటి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. పెథా§్‌ు తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సియంఓ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడుంటుదనేది త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నారు. కేసిఆర్‌ రెండోసారి సియంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సియం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ పర్యటన ఖరారైంది. ప్రాజెక్టుల పనులు అనుకున్నంత వేగంగా జరగడంల లేదని తానే స్వయంగా పరిశీలన కోసం వెళ్లనున్నట్లు సియం చెప్పారు. తుఫాను కారణంగా ఆ పర్యటన రద్దుఅయ్యింది.