కేసిఆర్‌పై హైకోర్టులో పిటిషన్‌

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కేసిఆర్‌పై 64 క్రిమినల్‌ కేసులు ఉంటే కేవలం 2 కేసులు ఉన్నట్లు మాత్రమే చూపారని పిటిషనర్‌ పేర్కొన్నారు. కేసిఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.