కేసిఆర్‌కు వంటేరు సవాల్‌

vanteru pratap reddy
vanteru pratap reddy

సిద్ధిపేట: టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌కు కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణ సాధన కోసం కేసిఆర్‌ దొంగ దీక్ష చేశారని , కావాలంటే ఇందిరా పార్క్‌ వద్ద చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఫ్లూయిడ్‌ ఎక్కించుకుని కేసిఆర్‌ దీక్ష చేశారని, రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌, టిడిపి రాజకీయంగా నష్టపోయినా తెలంగాణకు మద్దతిచ్చాయని తెలిపారు. తెలంగాణ వచ్చాక లాభపడింది కేసిఆర్‌ ఆయన కుటుంబమేనని ప్రతాపరెడ్డి అన్నారు.