కేసిఆర్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సియం కేసిఆర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ పర్యటనకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌లోని ఓ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 11.00 గంటల ప్రాంతంలో పొగ రావడం గుర్తించారు. వెంటనే అప్రత్తమైన భద్రతా సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా బయట పడేశారు. ఈ ఘటనపై ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఇదే విషయాన్ని సియం కార్యాలయాన్ని తాను ఫోన్లో సంప్రదిచానని సియంకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సియం తన ఆదిలాబాద్ పర్యటనను కొనసాగిస్తారని కేటిఆర్ తెలిపారు.