కేసరి బర్ఫీ

Kesari burfi
Kesari burfi

కేసరి బర్ఫీ

కావలసినవి

కోవా-కప్పు, పంచదార-పావ్ఞకప్పు, కుంకుమపువ్ఞ్వ-కొద్దిగా పాలు-రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి-అర టీస్పూన్‌ నెయ్యి-ఒక టేబుల్‌స్పూన్‌ మిఠాయిరంగు ఫుడ్‌కలర్‌ చిటికెడు పిస్తాపప్పులు-సరిపడా

తయారుచేసే విధానం

కోవాను చిదిమి నాన్‌స్టిక్‌ పాన్‌లో వేయాలి. అందులోనే పంచదార కూడా వేసి కరిగేవరకూ తక్కువ మంటమీద ఉడికించాలి. గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్ఞ్వ నాననివ్వాలి. తరువాత కోవా మిశ్రమంలో వేసి కలపాలి. మిఠాయిరంగు, యాలకులపొడి కూడా వేసి మరో ఎనిమిది నిమిషాలు తక్కువ మంటమీద ఉడికిం చాలి. మిశ్రమం అంచులకు అతుక్కోకుండా ఉండేంతవర కూ ఉడికించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి పిస్తాముక్కలు చల్లి కావలసిన ఆకారంలో కోసుకోవాలి.