కేర‌ళ‌కు న‌టుడు నాగార్జున సాయం

NAGARJUNA
NAGARJUNA

హైద‌రాబాద్ః కేరళ రాష్ట్రంలో ప్ర‌కృతి ప్ర‌కోపం యావత్ భారత దేశాన్ని కలిచివేస్తోంది. వరద ధాటికి ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులై.. తమను ఆదుకునే వారికోసం ఎదురుచూస్తున్నారు. చుట్టూ నీరు.. ఎటూ తోచని పరిస్థితి.. ఏ వైపు నుండి ఎలాంటి ముప్పు తన్నుకొస్తుందోననే భయం.. వీటన్నింటి మధ్య జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి చూసిన తెలుగు చిత్రసీమ.. వారిని ఆదుకోవడానికి నడుం బిగించింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కేరళ వరద బాధితుల కోసం ఆర్ధిక సహాయం ప్రకటించగా.. తాజాగా అక్కినేని దంపతులు నాగార్జున-అమల తమ వంతుగా 28 లక్షల రూపాయలను డొనేట్ చేసి ఉదారత చాటుకున్నారు. ఇంకా మరింతమంది ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.