కేర‌ళ‌కు ఏపి విప‌త్తు బృందాలు

Flood in Kerala
Flood in Kerala

 అమ‌రావ‌తిః కేరళ రాష్ట్రంలో వరద బీభత్సముతో ప్రజల నానా ఇబ్బందులు పడుతుండగా బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ నుండి అగ్నిమాపక శాఖకు చెందిన ప్రత్యేక రక్షక బృందాలను పంపారు. ఈ బృందాలు అక్కడ సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన అన్ని రోజులు వీరు సహాయక చర్యల్లో పాల్గొంటారని డిజి కె.సత్యనారాయణ అన్నారు. ఒక డీఎఫ్ఓ, ఎడిఎఫ్ ఓ, ఐదుగురు ఎస్ ఎఫ్ ఓలు, 75మంది సిబ్బంది, రక్షక పరికరాలతో గన్నవరం విమానాశ్రయం నుంచి కొచ్చి వెళ్లారు.