కేరళ జాలర్ల హత్యకేసులోనిందితులను భారత్‌కు పంపం

– ఇటలీ నావికాదళ అధికారుల వెల్లడి

హైదరాబాద్‌ : కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జాలర్ల హత్యకేసులో ఆరోపణలు కేసులో నిందితులు ఇద్దరు ఇటలీ నేవి అధికారులను ఇకపై భారత్‌కు తిప్పి పంపేది లేదని ఇటలీ ప్రభుత్వ నావికాదళ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఇటలీ రాయబార కార్యాలయంలో ఉన్న రెండు మెరైనర్‌ అధికారిని కూడా వెనక్కి తీసకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. 2012లో ఇటాలియన్‌ నౌక కేరళ వద్ద భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. ఆ నౌకలో ఉన్న ఇటాలియన్‌ మెరైన్‌లు ఇద్దరు కేరల జాలర్లను దొంగలనే అనుమానంతో కాల్చి చంపారు. దాంతో వారిని భారత ప్రభుత్వం అరెస్టుచేసి విచారణ జరిపింది. అందులో ఒక అధికారికి తీవ్ర అనారోగ్యం కారణంగా 2014లో ఇటలీ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇప్పుడు అతన్నే వెనక్కి పంపమని ఇటలీ మాటమార్చింది. ఈ ప్రకటనతో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరారు.