కేరళకు రూ.7 కోట్లు ఆర్థికసాయం ప్రకటించిన గూగుల్‌

Google
Google

న్యూఢిల్లీ: కేరళ వరద బాధితలకు సెర్చింజన్‌ దిగ్గజం ‘గూగుల్‌ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రంలోని వరద బాధితులకు చేపట్టే పునరావాస కార్యక్రమాల కోసం రూ.7 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘గూగుల్‌ డాట్‌ ఆర్గ్‌, గూగులర్స్‌ కలిపి కేరళ వరద బాధితుల కోసం మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు సంస్థ ఆగ్నేయాసియా, ఇండియా ఉపాధ్యక్షుడు ఆనందన్‌ చెప్పారు.