కేన్స్‌లో అమ్మడు షాక్‌

Shrutihassan1
Shrutihassan

కేన్స్‌లో అమ్మడు షాక్‌

సోషల్‌ మీడియాలో ఫ్రెండ్‌ అయిన వ్యక్తి ఎక్కడో అనుకోకుండా నేరుగా ఎదురుపడి పలకరిస్తే కలిగే ఎగ్జైట్‌మెంట్‌ వేరుగా ఉంటుంది. సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి.. వేరే దేశానికి చందిన వ్యక్తి మరేదో దేశంలో ఇలా ఎదురుపడితే ఎవ్వరైనా ఎగ్జైటవ్వాల్సిందే.. స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌కు కూడ ఇలాంటి అనుభవమే ఎదురైంది.. శ్రుతికి ఆంగ్ల రచయిత నెయిల్‌ గైమెన్‌ అంటే అభిమానం.. ఆయనతో ట్విట్టర్‌ ద్వారా ఫాలోయర్‌గా మారడమేకాదు.. ఆయనతో పరిచయం చేసుకుని ఫ్రెండ్‌గా కూడ మారింది.

. అయితే తాను కథానాయిక పాత్ర పోషిస్తున్న సంఘమిత్ర కోసం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లి అక్కడ రెడ్‌ కార్పెట్‌మీద సందడి చేసిన సంగతి తెలిసిందే..
అక్కడే ఆమెకు నెయిల్‌ గైమెన్‌ కన్పించాడు.. తాను ఫలానా అని మరోసారి పరిచయం చేసుకోగా.. నెయిల్‌చాలా సంతోషించి ఆమెను తాను రచన చేసిన హౌటు టాక్‌ ట గర్ల్స్‌ ఎట్‌ పార్టీస్‌ అనే హాలీవుడ్‌ ప్రీమియర్‌ షోకు అతిథిగా ఆహ్వానం అందించాడు.. ఆయన ఆహ్వానాన్ని మన్నించి శ్రుతి అక్కడ కూడ సందడి చేసింది.. ఈ సందర్భంగా శ్రుతి బహుముఖ ప్రతిభ గురించి కేన్స్‌ వేదికగా నెయిల్‌ గైమెన్‌ తెగపొగిడేశాడు.. ప్రతిగా తన అభిమాన రచయిత నెయిల్గ్త్‌న్‌ అంటూ శ్రుతి కొనియాడింది.. ఆయన నవలలు అంటే తన కిష్టమని ఆయన రాసిన నవలలు చాలా చదివానని శ్రుతి పేర్కొంది.. నెయిల్‌ను ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందంటూ ఎగ్జైట్‌ అయ్యింది శ్రుతి.