కేదారనాధ్‌లో స్వయంభువునిగా శివుడు

KEDARNATH-5
KEDARNATH

This slideshow requires JavaScript.

కేదారనాధ్‌లో స్వయంభువునిగా శివుడు

గంగానది ఉద్భవించిన పవిత్ర ప్రదేశం గంగోత్రి. ఇక్కడ గంగామాత ఆలయం ఉంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉత్తరకాశిజిల్లాలో గంగోత్రి పరమ పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. హిమాలయ పర్వత పంక్తుల్లో, హిమనీ నదాలనడుమ, ధవళకాంతితో మంచుతో కప్పి ఉన్న పర్వతాలు, లెక్కకుమించిన సరస్సులు, పచ్చని చెట్ల సమూహాలతో నిండిన అతి మనోహరమైన ప్రశాంత ప్రదేశం ఉత్తారా ఖండ్‌. దక్షిణాన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమాన హర్యానా, ఉత్తరాన హిమాచల్‌ప్రదేశ్‌, హద్దులుగా ఉన్న ఈ రాష్ట్రం సందర్శకులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉం దంటే సందర్శకుల కోలాహలాన్ని మనం ఊహిం చుకోవచ్చు.

స్వచ్ఛమైన పారదర్శకంగా ఉన్న గంగా జలాలలో స్నానమాచరిస్తే సర్వపాపాలూ ప్రక్షాళ నమై పవిత్రత కలుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్ర చరిత్ర గల గంగోత్రి ప్రదేశ విశేషాలను తెలుసుకొందాం! గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌ ఈ నాలుగు ప్రదేశాలను చార్‌ధామ్‌ అంటారు. యము నోత్రి, కేదారనాథ్‌,హరిద్వార్‌, రుషీకేశ్‌ నుంచి వచ్చే అన్ని వాహనాలు గంగోత్రి ఆలయం ఉన్న ప్రదేశం వరకు వస్తాయి. బదరీనాథ్‌లో విష్ణుమూర్తి, కేదార నాథ్‌లో పరమ శివుడు స్వయంభువులుగా వెలసి నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. గంగోత్రి అంటే గంగానది భూమి మీదకు దిగి వచ్చిన ప్రదేశం.

గంగ దివినుండి భువి కి దిగివచ్చింది. గంగ ఉతరీ (దిగినది) కనుక గంగోత్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. యమునోత్రి అంటే యమున భూమి మీద ఉద్భవించిన ప్రదేశం.గంగోత్రిలో గంగాదేవి, యము నోత్రిలో యమునాదేవి ఆలయాలు ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే గంగోత్రి, యమునోత్రిలోని ఆలయాల ను వైశాఖ శుద్ధ తదియ అంటే ఏప్రిల్‌ నెల చివరివారం లేదా మే మొదటి వారంలో వచ్చే అక్షయతృతీయగా పిలి చే వైశాఖ శుద్ధ తదియనాడు ఆలయా న్ని తెరుస్తారు.

దీపావళి పర్వదినాన దీపాలంకార సేవతో దీపావళి మరునాడు ఆలయాన్ని మూసి వేస్తారు. దీపావళి మరునాడు గంగోత్రి ఆలయాన్ని మూసివేయగానే గంగామాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా దగ్గరలోగల ముఖ్‌వా గ్రామానికి తీసు కువెళ్ళి అక్కడ ఉన్న ఆలయంలో ఉంచి నిత్య పూజలను నిర్వహిస్తారు. పురాణగాధ గంగోత్రి ప్రదేశం గురించి గంగావతరణం గురించి ప్రాచీన గాధ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు సగర చక్రవర్తి ఉండేవాడు.

ఎన్నో యజ్ఞయాగాలు చేసిన ధర్మవర్తనుడు. అతనికి ఇద్దరుభార్యలు. పెద్ద భార్య సుమతికి ఆరవై వేలమంది కుమారులు, కాగా చిన్న భార్య కేశినికి అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నారు. ప్రజలకు రాక్షస బాధను తొలగించేందుకై సగరుడు రాక్షసులతో యుద్ధంచేసి, వారిని అణచి వేస్తాడు. అటు తరువాత అశ్వమేధ యాగం చేయ సంకల్పించి యజ్ఞశ్వానికి రక్షకులుగా తన పుత్రులను పంపుతాడు. అశ్వమేథ యాగం దిగ్విజయంగా కొనసాగితేతన స్వర్గా ధిపత్యానికి ముప్పు తప్పదని భయపడి ఇంద్రుడు సగరపుత్రుల కళ్ళుగప్పి యజ్ఞాశ్వాన్ని దొంగచాటుగా దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో వదిలివేస్తాడు. సగర పుత్రులు అశ్వాన్ని వెదుకుతూ కపిలమహర్షి ఆశ్రమానికి చేరుతారు. మహర్షి తను యజ్ఞాశ్వాన్ని అపహరించాడని భ్రమించి ఆశ్రమ ధ్వంసానికి పూనుకుంటారు.

నిశ్చల తపస్సు లో ఉన్న కపిలుడు తపోభంగానికి కళ్ళు తెరచి సగరపుత్రులైన అరవై వేలమందిని భస్మం చేస్తాడు. దూరంగా ఉన్న అంశు మంతుడు పరిస్థితిని తండ్రికి విన్నవిస్తాడు. సగ రుడు బ్రహ్మని ప్రార్థించగా బ్రహ్మ విష్ణుపాదాల వద్దగల గంగను రప్పించి భస్మరాశులపై ప్రవహింప జేస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయని చెబు తాడు. సగరుడు గంగకై తపస్సు చేస్తాడు. కానీ ప్రయోజనం కలగదు. సగరుని కుమారుడు అంశు మంతుడు, అతని కుమారుడు దిలీపుడు కూడా గంగకై తపస్సుచేసి ఫలితం లేక నిరాశ చెందు తారు. సగరుని మునిమనవడికి వారసుడైన భగీ రధుడు తమ పూర్వుల దుస్థితికి దుఃఖించి, కఠోర నిశ్చలదీక్షతో గంగను ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. గంగ ప్రత్యక్షమై విష్ణులోకం నుండి తాను భువికి దిగి రావటానికి సిద్ధమేనని, కానీ తన ప్రవాహ ఉదృతికి భూమి భరించలేదని ఒక్క కైలాస శిఖ రానికే ఆ శక్తి ఉందని చెబుతుంది.

కైలాస శిఖరం పరమశివ్ఞని నివాసస్థానం కనుక భగీరధుడు శివ్ఞని ప్రార్థిస్తాడు. గంగ ఉదృతిని తగ్గించేందుకై శివ్ఞడు తన జటాజూటాన్ని గుండ్రంగా చుట్టి గంగను దివినుండి దిగిరావలసినదని ఆజ్ఞాపిస్తాడు. శివ్ఞని జటాజూటంలో గంగ ఇమిడిపోతుంది. అందుకై శివ్ఞడు పాయను సడలించగా మంద్రంగా ప్రవహి స్తూ గంగ భూమిని చేరుతుంది.

శివుని జటాజూ టం నుండి జారినగంగ చెల్లాచెదురై ఏడుపాయ లుగా చీలి ఏడు వైపులకు ప్రవహించింది. భగీ రథుని ప్రార్థనతో భువినుండి దిగిన గంగకు భగీరథి అనే పేరు వచ్చింది. మొదట గంగ నేలను తాకిన ప్రాంతం గంగోత్రి నుండి 18కి.మీ. దూరంలో ఉంది. దీనిని గోముఖ్‌ అంటారు. గోముఖ్‌ వరకు నడచిగానీ, గుర్రాలమీదగానీవెళ్ళాలి. ఇక్కడకు వెళ్ళే దారి చాలాకష్టతరంగా ఉంటుంది.

ఆస్తమా, గుండె జబ్బులున్నవారు వెళ్ళకూడదు. అందుకే గంగోత్రికి ఎక్కువ మంది సందర్శకులు వచ్చినా యమునోత్రికి వెళ్ళేందుకు తక్కువ మంది ఆసక్తి చూపుతారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్ళేవారు సాధారణంగా తమ యాత్రను ఢిల్లీ నుండి ప్రారంభిస్తారు. ఢిల్లీలో ప్యాకేజీ టూర్‌లు నిర్వహించే సంస్థలు ప్రైవేట్‌ బస్సులు అనేకం. మే, జూన్‌ సీజన్‌ కనుక రద్దీ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రద్దీ అంత ఉండదు.