కేఈకి దేవదాయశాఖ కేటాయింపు

K E Krushna murthy
K E Krushna murthy

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి దేవదాయశాఖను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. బిజెపి మంత్రుల రాజీనామా తర్వాత దేవదాయశాఖ, ఆరోగ్యశాఖలు సీఎం వద్ద ఉన్నాయి. వీటిలో దేవదాయశాఖను కేఈ కృష్ణమూర్తికి కేటాయించడంతో, ఆరోగ్యశాఖను ఎవరికి ఇస్తారనే దానిపై సర్వత్రా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.