కేంద్ర సహకారం లేకపోయినా మున్ముందుకు..

AP CM
AP CM

విశాఖ: సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజీపడే ప్రసక్తే లేదని సియం చంద్రబాబు అన్నారు. పాయకరావుపేట గ్రామదర్శినిలో చంద్రబాబు మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఏపికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఐనా కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే నిరుద్యోగ భృతికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. పేదవారికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ టిడిపినేనని గుర్తుచేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపినే ముందుందని తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.