కేంద్ర రాజకీయాల్లో కూడా మనం కీలక పాత్ర పోషించాలి

kcr
kcr

ఆదిలాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సమస్యలను కొంతమేర పరిష్కరించామని కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే పరిష్కారిస్తామిన కెసిఆర్‌ హామినిచ్చాడు. కెసిఆర్‌ ఇచ్యోడలో ప్రజాశీర్వాద సభలో ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రతీ రైతుకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా తండాల్లో మా రాజ్యం రావాలని చాలాకాలం మీరంతా పోరాటం చేశారు. రాష్ట్రంలో గిరిజన జనాభా పెరిగింది. రాష్ట్రంలో గిరిజనులు 12 శాతం ఉన్నరు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముంది. రిజర్వేషన్ల తీర్మానం కేంద్రానికి పంపినం. గిరిజనుల రిజర్వేషన్లు పెంచేందుకు ప్రధాని మోదీ ముందుకురాలేదు. సమస్యను పరిష్కరించడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. ఢిల్లీ మెడలు వంచి గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చే బాధ్యత నాదని సీఎం హామీనిచ్చారు. కేంద్ర రాజకీయాల్లో కూడా మనం కీలక పాత్ర పోసించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.