కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం

Verendra kumar
Verendra kumar

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం

వీరేంద్రకుమార్‌ (లోక్‌ సభ సభ్యుడు, తెకామత్‌ – మధ్యప్రదేశ్‌)కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని టి కంఘా నుంచి ఎంపిగా ఎన్నికైన వీరేంద్ర వరుసగా ఆరుసార్లు విజయం సాధించి ప్రజలకు సేవలందించారు. కార్మికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి, లాభదాయక పదవులు వివాదంలో సంయుక్త సంఘానికి చైర్మన్‌గా, జాతీయ సామాజిక భద్రత మండలి సభ్యుడిగా సేవలందించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కార్మిక సంక్షేమ శాఖ హక్కుల సంఘ సభ్యుడిగా, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ స్థాయీ సంఘ సభ్యుడిగా కూడా పనిచేశారు. జేపీ పిలుపుతోనే ఉద్యమబాట పట్టారు. ఎంఏ చదివి బాలకార్మిక వ్యవస్థపై పిహెచ్‌డి చేశారు.