కేంద్ర ప్రభుత్వంపై మమతా ఆరోపణలు

mamata banerjee
mamata banerjee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ బుధవారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించారు. ఈసందర్భంగా మమతా కేంద్రంపై విమర్శలు చేశారు. ఢిల్లీ హింసపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రజల్లో భయం సృష్టిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ఈ రోజు కొంత మంది కరోనా అంటూ పెద్దగా అరుస్తున్నారు. కానీ, వాళ్లు చెబుతున్నంత ప్రమాదంగా కరోనా లేదు. అది భయంకరమైన వ్యాధి అయినప్పటికీ, ప్రజల్లో ఇంతగా భయం పుట్టించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని న్యూస్‌ చానళ్లు ఢిల్లీలో జరిగిన ఘటనను అణగదొక్కేందుకు వైరస్‌పై అతిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందాలని మనం అనుకోకూడదు. కానీ, ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన వాళ్లు  ఈ వైరస్‌ కారణంగానే చనిపోలేదని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా కరోనా సోకి చనిపోతే కనీసం వాళ్లు  ఓ భయంకరణమైన వైరస్ కారణంగా మరణించారని మనకు తెలుస్తుంది. కానీ, కొంతమంది ఆరోగ్యవంతులను కనికరం లేకుండా చంపారు. దీనికి వాళ్లు (బిజెపి) ఇప్పటిదాకా క్షమాపణ కూడా చెప్పలేదు. వాళ్లది ఎంత అహంకరమో అర్థం చేసుకోంది. పైగా గోలీ మారో అంటున్నారు. అలాంటి వాళ్లు బెంగాల్, యూపీ రెండూ ఒకటి కాదని తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నా’ అని మమత పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/