కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య, జస్టీస్‌ ఈశ్వరయ్య అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈరోజు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో ఏపీ రాష్ట్రం కాపులకు 5 శాతం ఇస్తున్నదని ఈబీసీ రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాదంటూ ఆర్ కృష్ణయ్య సుప్రీంలో పిటిషన్ వేశారు.