కేంద్రానికి తిరుపతి సభ హెచ్చరిక

kalva
kalva

అమరావతి: తిరుపతి సభ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక అని రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బిజెపి డైరెక్షన్‌లో వైఎస్‌ఆర్‌సిపి పనిచేస్తుందని, అసలు పోరాటాన్ని వైఎస్‌ఆర్‌సిపి తప్పుదారి పట్టిస్తుందని మేం తిరుపతిలో ధర్మపోరాట సభ నిర్వహిస్తే వంచకులంతా కలిసి విశాఖలో దీక్ష చేశారని మంత్రి అన్నారు. అంతేగాక వైఎస్‌ఆర్‌సిపి కుట్ర రాజకీయాలు చేస్తుందని ,ఏపి రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యాన్ని తిరుపతి సభ ద్వారా తెలిపామని మంత్రి అన్నారు.