కేంద్రమంత్రితో మంత్రి కెటిఆర్ భేటి

న్యూఢిల్లీ: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో ఈరోజు ఉదయం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సుకు కేంద్రమంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. అలాగే వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ నాగ్‌పూర్ రెండు కొత్త కారిడార్లు మంజూరు చేయాలని, హైదరాబాద్-బెంగళూర్- చెన్నైను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విన్నవించారు. ఇదే అంశంపై దక్షిణాది మంత్రులకు ఇప్పటికే లేఖలు కూడా రాశామని చెప్పారు.
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్ట్తో పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతు ఇవ్వాలని కేంద్రంమంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ ఎన్ఐఎమ్జెడ్ గురించి కేంద్ర మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా తన కార్యాల సిబ్బందిని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ కోరారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/