కేంద్రం రాష్ట్రానికి చేసింది కొంతే

AP CM Chandra babu Naidu-2

మూడున్నరేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసింది కొంతేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. చేస్తాం, చూస్తాం అంటే ప్రజలు నమ్మరని, ఆ స్థాయి దాటిపోయిందన్నారు. కావాల్సింది హామీలు కాదు.. చేతలు, స్పష్టమైన కార్యాచరణ అని పేర్కొన్నారు.