కేంద్రం నుంచి రూ.74,542కోట్లు రావాలి

JP

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.74,542కోట్లు రావాల్సి ఉందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. జేఎఫ్ సీ నివేదికపై మీడియాతో ఆయన మాట్లాడుతూ… 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందన్నారు. వెనుకబడిన 7జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. పోలవరంలో డబ్బుల ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి సాయం చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాజధానిలో మౌలిక వసతులు, రహదారులు, రైళ్ల సదుపాయానికి కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉందన్నారు.