కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తాంః ఉమ

విజయవాడః కేంద్రం ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మండిపడ్డారు. గురువారం బంద్ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల దగ్గర బొండా ఉమ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేస్తారని ఎదురు చూశామన్నారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిధులు కేటాయించక పోవడం దారుణమని ఆయన విమర్శించారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నా ప్రధాని మోదీ ప్రకటన చేయకపోవడం బాధ కలిగించిందన్నారు. ఇప్పటి వరకు సానుకూల ధోరణితో వేచిచూశాం… కేంద్రం దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని బోండా ఉమ స్పష్టం చేశారు.