కేంద్రం చొర‌వ‌తోనే ఏపికి పెట్టుబ‌డులు పెరిగాయిః పురంధేశ్వ‌రి

purandeswari
purandeswari

విజ‌య‌వాడః ప్రత్యేక ప్యాకేజీతోనే ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేకూరుతుందని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాతో లాభం ఉండదని జైట్లీ చెప్పారని…జైట్లీ ప్రకటనను తప్పుగా అర్దం చేసుకున్నారని తెలిపారు. కేంద్రం ఏపీకి తప్పకుండా న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్థికలోటు పూడ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని… ఏపీకి పన్ను రాయితీలు కొనసాగుతాయని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. కేంద్రం చొరవతోనే ఏపీకి పెట్టుబడులు పెరిగాయన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్యను ఇరు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారని చెప్పారు. కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తామని పురందేశ్వరి అన్నారు.