కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాజీలేని పోరాటం

AP CM BABU-33
AP CM BABU-

This slideshow requires JavaScript.

కేంద్రం చేస్తున్న అన్యాయంపై
రాజీలేని పోరాటం

రాష్ట్రానికి నష్టం చేస్తే సహించబోం
హామీలపై చేసే పోరాటాలకు కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు
జెఎన్‌టియు కళాశాల శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

నరసరావుపేట(గుంటూరుజిల్లా) : ”కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సిఎం చంద్ర బాబు కస్సుమన్నారు…గుంటూరుజిల్లా కోటప్పకొండ వద్ద జరిగిన బహిరంగ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటంచేస్తామని హెచ్చరికలు పంపారు… ఇన్నాళ్ళు అన్యాయాన్ని సహించామని ఆవేదన వ్యక్తం…. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. గుంటూరుజిల్లా కోటప్పకొండ వద్ద ఉన్న కాకాని గ్రామ సమీపంలో నిర్మించనున్న జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలకు, కోటప్పకొండలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభో త్సవాలను నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజన, కేంద్ర ప్రభుత్వ హామీలు, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తదితర అంశాలపై మాట్లాడారు.

కేంద్రంలో ఆ నాడు కాంగ్రెస్‌ హేతుబద్దతలేని అడ్డదిడ్డమైన విభజన చేసిందని, నేడు అక్కడ ఉన్న బిజెపి అభివృద్ధికి సహకరించడం లేదని ఆయన ఆక్రోసించారు. అన్యా యానికి న్యాయం చేయమని అడుగుతున్నామని, ఇది ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల డిమాండ్‌గా తాను చేస్తున్నానని తెలిపారు. దీనిపై వ్యక్తిగత ఎజెండాలతో రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు. భావి తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కొరకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు.

మొదటి నుండి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టిడిపి మాత్రమే మాట్లాడుతుం దన్నారు. ఆవేశంలో ప్రజలు ఉన్నారని, హామీలపై కేంద్రంతో ఎటువంటి రాజీపడేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని మాట్లాడటం సరికాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుందని, అసెంబ్లీ, పార్లమెంట్‌లలో మాత్రమే ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన లెక్కలపై మాట్లాడతారని స్పష్టం చేశారు. రాష్ట్రం, కేంద్రం కలిసి ప్రజలకు మేలు చేయాలన్నారు. సంఘ టితంగా ప్రభుత్వానికి సంఘీభావం తెలపా లని ప్రజలకు సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
=====