కేంద్రం చెబుతున్న మాట‌లు అవాస్త‌వంః నారాయ‌ణ‌

narayana
Narayana

అమరావతి: కేంద్రానికి డీపీఆర్ పంపలేదనడం అవాస్తవమని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు. డీపీఆర్ పంపలేదు కాబట్టే నిధులు కేటాయించలేదనడం అర్థరహితమన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన.. సీఆర్‌డీఏ అభివృద్ధికి రూ. 5 లక్షల కోట్లు అవుతుందని డీపీఆర్‌ ఇచ్చామన్నారు. రాజధానిలో పరిపాలన భవన నిర్మాణాలకూ డీపీఆర్ పంపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రబడ్జెట్‌లో ఆంద్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందన్నారు. కేబినెట్ సమావేశంలో అర్బన్ హౌసింగ్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రూ. 38 వేల కోట్లతో పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 2019 మార్చి నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.