కేంద్రం ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

Cash
Cash

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), డియర్‌నెస్ అలవెన్స్ (డీఆర్) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదనంగా రెండు శాతం డీఏ, డీఆర్ పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 జూలై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2 శాతం డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచేందుకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పడిస్తున్న 7 శాతం బేసిక్ పే/పెన్షన్‌కు మరో 2 శాతం అదనంగా పెంచేందుకు నిర్ణయం తీసుకుందని అధికారికంగా విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల ఆధారంగా అంగీకరించిన ఫార్ములా కింద ఈ పెంపు జరిగింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా పెంచిన డీఏ, డీఆర్‌తో 48.41 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇందువల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ6,112.20 కోట్ల అదనపు భారం పడుతుంది