కేంద్రం ఇచ్చింది తక్కువే

Chandrababu
అరుణ్‌జైట్లీని మళ్లీ అడిగా..
త్వరలో కేటాయింపులు పెంచుతామన్నారు
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించినమేర కేటాయింపు రాలేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేధన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన అనంతరం రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశించాం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం నుంచి విడుదలకావల్సిన ఆర్ధికసహాయం , ఆర్ధికలోటు భర్తీ, రాజధాని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంకోసం అవసరమైన నిధులు ఇవ్వాలని కోరాం.ప్రక్కనే ఉన్నా రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేంత వరకూ కేంద్రం చేయూతనివ్వాలని ఈ మేరకు పలుమార్లు ఢిల్లి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడి , ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కోరాను. గొంతెమ్మ కోర్కెలు కాదని చెప్పాము. న్యాయపరంగా రావల్సిన హామిలను వివరించాము. అయినా ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌జైట్లి ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌ ఆశించినంతగా కేటాయింపులు జరగలేదని చంద్రబాబు నాయుడు చెప్పారు.దీనిపై మంగళవారం కేంద్ర మంత్రి అరున్‌జైట్లీ తో ఫోన్‌లో మాట్లాడామన్నారు. రాష్ట్రప్రజల మనో భావాలను బడ్జెట్‌ కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఆర్ధిక కష్టనష్టాలను అరుణ్‌జైట్లీ కి మరోసారి వివరించగా స్పందించిన ఆయన ప్రస్తుతం శాఖల వారిగానే బజ్జెట్‌ కేటాయింపులు జరిగాయనీ, ఈ రాష్టం ఆర్ధికపరిస్థితి , కష్టనష్టాలు తమకు పూర్తిగా తెలుసుననీ, ఈ ఆర్ధిక సంవత్సరంలోనే హామిలపై స్పష్టత ఇస్తామని అరుణ్‌జైట్లీ హామి ఇచ్చారనీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు రాష్ట్రఆర్ధికలోటు భర్తీకి రాజధానికి పోలవరం నిర్మాణాలకు సరిపోవని చెప్పారు. ఇంకా చాలా మంది నాయకులు అభివృద్ధిని కాంక్షించేవారంతా పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం విజయవాడలోని ఎ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం , రాష్ట్రాబివృద్ధికోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న నేపధ్యంలో ఈ విషయంపై తొలిసారిగా కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకుని నాయకులు ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు. కొత్తగా వచ్చే నాయకులు , పాతవారు మమేకమై నియోజకవర్గంలో పార్టీని తిరిగిలేని శక్తిగా పటిష్టవంతం చేయలన్నారు.