కేంద్రంపై మంత్రి అఖిల ఆరోపణలు

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ కేంద్రం పాలనపై ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారని ఆఖిల ఆరోపించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గోన్న అఖిలప్రియ మాట్లాడుతూ, మహిళలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిపై దాడి చేయాలని, అత్యాచారాలు చేయాలని నేతలు రెచ్చగొట్టి పంపిస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేస్తున్న రోజే కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై అఖిల ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొంతకాలం నుంచి బిజెపికి దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు, కాంగ్రెస్తో చెలిమి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.