కెసిఆర్ ఫామ్‌హౌస్ నుండే పాలిస్తున్నారు:విజయశాంతి

కరీంనగర్: ప్రజాకూటమి ప్రచారతార విజయశాంతి, కాంగ్రెస్ ప్రచారకమిటి ఛైర్మన్ భట్టి విక్రమార్కతో కలసి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కరీంనగర్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన మహిళ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల సమస్యలు విని పరిష్కరించే నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళకూ చోటు కల్పించలేదని, కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో పదిమంది మహిళలున్నారని తెలిపారు. సీఎం కెసిఆర్ .. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారని విజయశాంతి విమర్శించారు.