కెసిఆర్‌ ప్రభుత్వం నిద్రపోతుంది!

B VIKRAMARKA
B VIKRAMARKA

ఎర్రుపాలెం: టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్కు రెండో విడత ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీరవోలు, తక్కెళ్లపాడు, సఖినవీడు, ముటుగుమాడు, ఇనగాలి, రామన్నపాలెంలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కెసిఆర్‌ నాలుగేళ్లకాలంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా దున్నపోతులా నిద్రపోయారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి, దళారులకు, ప్రజలకు దొరలకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణంచారు.