కెసిఆర్‌ నా నియోజకవర్గనికి వస్తే సన్మానం చేస్తా

Congress Leader Jagga reddy
Congress Leader Jagga reddy

హైదరాబాద్‌: నా నియోజకవర్గ ప్రజలకోసం తెలంగాణ సిఎం కెసిఆర్‌తో నాకు అవసరం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యె తూర్పు జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కెసిఆర్‌ అపాయింట్‌ మెంట్‌ ఇచ్చే వరకు వేచి చూస్తానని ఈరోజు లాబీల్లో విలేకరులతో ఆయన అన్నారు. నా నియోజకవర్గానికి సీఎం కెసిఆర్‌ వస్తే సన్మానం చేస్తానని, లేకుంటే సైలెంట్‌గా ఉంటానని ఆయన అన్నారు. అలాగే మా వాళ్లకి కూడా అనవసర వ్యాఖ్యలు చేయద్దని చెప్పానని, అంతేగాక నా స్టాండ్ కూడా ముందే ప్రకటించానన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చాక కామెంట్ చేయడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు.