కెసిఆర్‌ దృతరాష్ట్ర పాలన చేస్తున్నారు

Congress Leader Jagga reddy
Jagga reddy

హైదరాబాద్‌:    తెలంగాణలోనుండి కెసిఆర్‌ను , ఆయన కుటుంబ సభ్యులను రోడ్లపై తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో బెయిల్‌పై వచ్చిన ఆయన కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాడు దృతరాష్ట్రుడు కళ్లు లేక పాలన చేస్తే నేడు కళ్లు ఉండి కెసిఆర్‌ దృతరాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని ఆయన  విమర్శించారు.