కెసిఆర్, కెటిఆర్‌లకు సవాలు విసిరిన రేవంత్

మహబూబ్‌నగర్: తనపై పోటీచేసే సత్తా కెసిఆర్‌కు గానీ, కెటిఆర్‌కు గానీ ఉందా అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం కోస్గిలో నిర్వహించిన కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్, డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. చేరిన వాళ్లను టీఆర్ఎస్ మళ్లీ మళ్లీ చేర్చుకొని కూలీ డబ్బులు ఇస్తోందని విమర్శించారు. కొడంగల్‌లో తనపై కేసీఆర్ గానీ.. కేటీఆర్ గానీ పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. పోటీచేస్తే తన తడాఖా ఏంటో చూపిస్తానని సవాల్ చేశారు. తనకు అండగా నిలిచిన కొడంగల ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తుదిశ్వాస విడిచాక కూడా తన సమాధి కొడంగల్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.