కెసిఆర్‌ను అడ్డుకునేందుకు ఇంతమంది కలవాలా

kcr
kcr

వనపర్తి: తెలంగాణ సమాజానికి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిలు ఎంతో ముఖ్యమైనవని కెసిఆర్‌ అన్నారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన చరిత్ర టిఆర్‌ఎస్‌ది అని తెలిపారు. కెసిఆర్‌ను అడ్డుకునేందుకు ఇంతమంది ఏకం కావాలా? అని వ్యాఖ్యానించారు.విటన్నింటినీ గమనించి ఎవరు ఎటువైపు ఉంటారో ప్రజలే ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎందుకు ఇవ్వలేదని కెసిఆర్‌ ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపైనా కేసీఆర్ విరుచుకుపడ్డారు. నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని, ఆ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పూజలు చేస్తున్నారంటూ మోదీ చేసిన విమర్శలపై స్పందించిన కెసిఆర్‌ .. మేము పూజలు చేసుకుంటే మీకెందుకు బాధ అని ఘాటైన సమాధానం ఇచ్చారు.