కెసిఆర్‌,జగన్‌ తప్ప అంతా వచ్చారు

chandrababu
chandrababu

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సిఎం మమత బెనర్జీ నిర్వహిస్తున్న కోల్‌కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని ఏపి సిఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌, వైఎస్‌ జగన్‌ తప్ప అందరూ ర్యాలీకి వచ్చారని ఆయన తెలిపారు. కోల్‌కతాకు వచ్చిన వాళ్లందరు మెడి వ్యతిరేకులే అని దీంతో కెసిఆర్‌, జగన్‌లు మోడితోనే ఉన్నారని సుస్పమవుతుందన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది అసలు లేదని.. అదొక శూన్యం మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది పెద్ద సున్నా అని అన్నారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్‌ ఫ్రంట్ అని‌.. అదసలు బిజపి  ప్రతిపక్షమే కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.