కెల్విన్‌తో పరిచయం వాస్తవమే

puri jaganath
puri jaganath

కెల్విన్‌తో పరిచయం వాస్తవమే

హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియా కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న కెల్విన్‌తో తనకుపరిచయం ఉందనిసిట్‌ విచారణలో దర్శకుడు పూరీ జగన్నాధ్‌ అంగీకరించారు.. తన మిత్రుడి ద్వారా కెల్విన్‌తో తనకు పరిచయం ఏర్పడిందని , అతను పరిచయమైనపుడు డ్రగ్స్‌ చేస్తాడన్న విషయం తనకు తెలియదని అన్నారు.. కొన్నాళ్ల తర్వాత అతడు డ్రగ్స్‌ సరఫరాచేస్తాడని తెలిసిందని, అప్పటి నుంచి అతనితో సంభాషణలు తగ్గించినట్టు గా వెల్లడించారు.. కాగా మొదటి రెండు గంటల్లో సిట్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు పూరీతడబడ్డాడు.. తొలుత తనకు కెల్విన్‌ ఎవరో తెలియదనే చెప్పేందుకు పూరీ ప్రయత్నిస్తుండగా సిట్‌ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటంతోనిజం చెప్పాడు.